సంతోషం అవార్డ్స్ 2025 కార్యక్రమానికి సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో అక్టోబర్ 16న  సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సురేష్ కొండేటి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మంగళవారం సాయంత్రం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలుసుకొని, ఆహ్వాన పత్రికను అందజేశారు. చిత్ర పరిశ్రమకు ఎప్పుడూ అండగా ఉండే చంద్రబాబు, ఇలాంటి అవార్డుల కార్యక్రమాలు చిత్ర పరిశ్రమలోని ప్రతిభను ప్రోత్సహిస్తాయని చెబుతూ సురేష్ కొండేటిని అభినందించారు. సురేష్ కొండేటి ఆహ్వానంపై సీఎం సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమానికి ఆదిత్య మ్యూజిక్ మ్యూజిక్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది. అలాగే, సూర్య సిమ్, విజయ వారహి మూవీస్, వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వెన్ లాక్ గ్రూప్ వంటి సంస్థలు ఈ వేడుకకు భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఈ అవార్డుల కార్యక్రమం గతంలో కన్నా అద్భుతంగా ఉంటుందని, అన్ని భాషల నుంచి మంచి సహకారం లభిస్తోందని సురేష్ కొండేటి తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)