17న ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా 'ఓటు అధికార్‌ యాత్ర' : రాహుల్‌ గాంధీ

Telugu Lo Computer
0


బీహార్‌లో ఎస్‌ఐఆర్‌ ద్వారా బిజెపి లక్షలాది ప్రజల ఓట్లను తొలగిస్తుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఎస్‌ఐఆర్‌ని నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎంపి రాహుల్‌ గాంధీ 'ఓట్‌ అధికార్‌ యాత్ర'ను చేపట్టనున్నారు. ఆగస్టు 17న బీహార్‌లో ఈ యాత్ర ప్రారంభమవుతుందని ఇందులో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. 'ఇది కేవలం ఎన్నికల సమస్య కాదు, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటానికి చేస్తున్న యుద్ధం. దేశవ్యాప్తంగా ఒక మనిషికి ఒక ఓటు మాత్రమే ఉండాలని చేస్తున్న యుద్ధం. ఈ యాత్రలో యువత, కార్మికులు, రైతులు, ప్రతి పౌరుడు ఈ ప్రజా ఉద్యమంలో చేరండి. ఈసారి ఓటు దొంగల ఓటమి ఖాయం. ప్రజలది, రాజ్యాంగానిదే విజయం' అని రాహుల్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)