ఐఫోన్‌ 17 సిరీస్‌ 50 డాలర్లు పెంపు ?

Telugu Lo Computer
0


సెప్టెంబర్‌ 9న  ఐఫోన్‌ 17 సిరీస్‌ ఫోన్లు లాంచ్‌ కానున్నాయి. ఈ సిరీస్‌లో ఐఫోన్‌ 17, ఐఫోన్‌ 17 ఎయిర్‌, ఐఫోన్‌ 17 ప్రో, ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్‌ ఉండనున్నట్లు సమాచారం. అయితే గతంతో పోల్చితే ఈసారి వచ్చే మోడళ్లలో భారీ అప్‌గ్రేడ్‌లు ఉంటాయని, ఈ కారణంగా ధరల పెరుగుదలకు అవకాశముందని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల ఐఫోన్‌ 17, ఐఫోన్‌ 17 ప్రో మోడళ్ల అమెరికా ధరలు లీకయ్యాయి. దాదాపు 50 డాలర్ల పెంపు ఉన్నట్లు తెలుస్తోంది. ఐఫోన్‌ 17 128జీబీ వేరియంట్‌ ధర ఈసారి $849 లేదా ₹84,990 ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఐఫోన్‌ 16ప్రో ధర $999 గా ఉండగా.. ఈసారి ఐఫోన్‌ 17 ప్రో ధర $1,049 లేదా ₹1,24,990 ఉండనున్నట్లు, ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్‌ ధర $1,249 లేదా ₹1,50,000కు పెరగవచ్చని సమాచారం.

Post a Comment

0Comments

Post a Comment (0)