మహారాష్ట్రలో నాలుగు అంతస్తుల భవనం కూలి 14 మంది మృతి

Telugu Lo Computer
0


హారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా విరార్‌లో నాలుగు అంతస్తుల అక్రమ భవనంలో కొంత భాగం బుధవారం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో తల్లీకూతుళ్లతోపాటు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సహాయక చర్యలు  ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి 12:05 గంటల ప్రాంతంలో రమాబాయి అపార్ట్‌మెంట్‌ వెనుక భాగం ఒక్కసారిగా కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ భవనం 2012 లో నిర్మించబడింది. ప్రమాదం జరిగిన తర్వాత బిల్డర్‌ను వసాయి-విరార్ మున్సిపల్ కార్పొరేషన్ ఫిర్యాదు మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కి చెందిన రెండు బృందాలు సంఘటనా స్థలంలో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకునే అవకాశం ఉందని పాల్ఘర్ జిల్లా కలెక్టర్ ఇందురాణి జాఖర్ తెలిపారు. ప్రమాదంలో ఇప్పటి వరకు 17 మందిని గుర్తించామని, అందులో 14 మంది మరణించగా, ఒకరు గాయపడగా, ఇద్దరిని సురక్షితంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం సహాయక పనులు శరవేగంగా జరుగుతున్నాయని వీవీఎంసీ అసిస్టెంట్‌ కమిషనర్‌ గిల్సన్‌ గోన్‌సాల్వేస్‌ తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)