ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలోని ఎన్టీఆర్ క్రీడా మైదానం వద్ద సంపత్ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు 126 అడుగుల ఎత్తు ఉన్న భారీ శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహాన్నినిలబెట్టారు. ఈ విగ్రహాన్ని పూర్తిగా మట్టితోనే తయారు చేయడం విశేషం. 45 మంది కార్మికులు దాదాపు రెండు నెలలు కష్టపడి ఈ భారీ వినాయకుడి విగ్రహాన్ని రూపొందించారు. అయితే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా దీన్ని నిర్మించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ అతిపెద్ద మట్టి వినాయకుడిని అనకాపల్లికి చెందిన ప్రముఖ శిల్పి కామదేను ప్రసాద్ పర్యవేక్షణలో నిర్మాణం చేశారు. 45 మంది కార్మికులు దాదాపు 50 రోజుల పాటు శ్రమించి తయారు చేశారు. ఈ 126 అడుగుల భారీ గణనాథుడి విగ్రహాన్ని తయారు చేసేందుకు 10 టన్నుల బంక మట్టిని ఉపయోగించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. బుధవారం రోజున ప్రారంభమైన నవరాత్రోత్సవాలు వచ్చే నెల 23వ తేదీ వరకు జరగనున్నట్లు తెలిపారు. దాదాపు నెల రోజుల వ్యవధి ఉండగా ఈ కాలంలో రోజుకు ఒక సాంస్కృతిక కార్యక్రమంతోపాటు ఆధ్యాత్మిక పోటీలను నిర్వహించనున్నారు. భారీ లంబోదరుడిని చూసి.. దర్శించుకునేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు.
అనకాపల్లిలో మట్టితో తయారు చేసిన 126 అడుగుల వినాయక విగ్రహం ఏర్పాటు
August 28, 2025
0
Tags