దేశంలోని ప్రతి ఇంటికి కంప్యూటర్లను తీసుకువస్తామని హామీ ఇచ్చే JioPC సేవను ప్రారంభించడం ద్వారా రిలయన్స్ జియో మరో పెద్ద అడుగు వేసింది. ఈ సేవ Jio సెట్ టాప్ బాక్స్ ద్వారా పనిచేస్తుంది. అలాగే వెబ్ బ్రౌజింగ్, ఆన్‌లైన్ తరగతులకు హాజరు కావడం, ఆఫీస్ యాప్‌లను ఉపయోగించడం వంటి రోజువారీ కంప్యూటింగ్ పనుల కోసం రూపొందించారు. JioPC అనేది టీవీని కంప్యూటర్‌గా మార్చే వర్చువల్ డెస్క్‌టాప్ సేవ. దీని కోసం Jio సెట్ టాప్ బాక్స్, అనుకూలమైన టీవీ, కీబోర్డ్-మౌస్ మాత్రమే అవసరం. JioPC Microsoft Officeకి ఓపెన్ సోర్స్ ప్రత్యామ్నాయమైన LibreOfficeతో వస్తుంది. Microsoft యాప్‌లు స్థానికంగా మద్దతు ఇవ్వనప్పటికీ, మీరు వాటిని బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. JioPC ని ఉపయోగించడానికి కస్టమర్లు Jio సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు లేదా రూ. 5,499 వన్-టైమ్ ఫీజు చెల్లించడం ద్వారా దాన్ని యాక్సెస్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ సేవ ఉచిత ట్రయల్ అందించనుంది. ఈ సేవతో రిలయన్స్ జియో మరోసారి తన వ్యవస్థను బలోపేతం చేస్తోంది. Jio ఈ చర్య డిజిటల్ ఇండియా, రిమోట్ వర్కింగ్/లెర్నింగ్‌ను కూడా వేగవంతం చేస్తుంది. టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం.. జియో తన 488 మిలియన్ల వినియోగదారులను మరింత పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. కంప్యూటర్ యాక్సెస్ చాలా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ సేవ గేమ్-ఛేంజర్‌గా ఉంటుందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్‌కు చెందిన తరుణ్ పాఠక్ అన్నారు. దాదాపు 70 శాతం భారతీయ కుటుంబాలకు టీవీ ఉంది. కానీ 15 శాతం మందికి మాత్రమే కంప్యూటర్ ఉంది. జియోపీసీ కంప్యూటింగ్‌ను చౌకగా, సులభంగా చేయగలదు. ముఖ్యంగా గ్రామీణ, తక్కువ ఆదాయ కుటుంబాలకు ఉపయోగకరంగా ఉండనుంది.
రిలయన్స్ జియో పీసీ !
July 16, 2025
0
Tags