పాత మాగులూరులో జంట హత్యలు కలకలం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా సంత మాగులూరు మండలం పాత మాగులూరులో జంట హత్యలు కలకలం రేపాయి. పాత మాగులూరులోని ఓ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో తండ్రి, కుమారుడి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. బెంగళూరుకు చెందిన కె.వీరాస్వామిరెడ్డి (62), అతని కుమారుడు కె.వి.ప్రసాద్‌రెడ్డి (37) నిన్న సాయంత్రం కోర్టు పనిమీద పల్నాడు జిల్లా నరసరావుపేటకు వచ్చారు. బుధవారం ఉదయం నరసరావుపేట కోర్టుకు బయలుదేరుతున్న క్రమంలో రెండు వాహనాల్లో వచ్చిన ఆరుగురు వ్యక్తులు తండ్రి, కుమారుడిని కిడ్నాప్‌ చేశారు. అక్కడి నుంచి పాతమాగులూరులోని ఓ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లోకి తీసుకెళ్లి ఇద్దరినీ హత్య చేసి పరారయ్యారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల మధ్య విభేదాలే హత్యలకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి మాధవరెడ్డి ఇద్దరినీ హత్య చేయించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)