అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న షానీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'డకాయిట్'. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రిత యార్లగడ్డ నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీలో ఒకేసారి తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే తాజాగా జరుగుతున్న షూటింగ్ సెట్లో ప్రమాదం జరిగినట్టు సమాచారం. హీరో హీరోయిన్లకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా సెట్ లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో హీరోహీరోయిన్లు అడవి శేష్, మృణాల్ లకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. దీంతో షూటింగ్ ని నిలిపివేసి వారిని ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.
'డకాయిట్' షూటింగ్ సెట్ లో ప్రమాదం : అడివి శేష్, మృణాల్ లకు తీవ్ర గాయాలు ?
July 23, 2025
0
Tags