మౌలిక సదుపాయాల అభివృద్ధిలో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యాన్ని మరింత పెంచాలన్న లక్ష్యంతో అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ రెండో పబ్లిక్ ఇష్యూ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ లను ప్రారంభించినట్లు ప్రకటించింది. అదానీ గ్రూప్స్ లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకమైనది. భారత్ మౌలిక సదుపాయాల అభివృద్దిని పెంచడంలో 1993 నుండి ఈ సంస్థ పని చేస్తోంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా భారత్ లోనే అతిపెద్ద లిస్టెడ్ బిజినెస్ ఇంక్యుబేటర్ గా ఈ సంస్థ గుర్తింపు పొందింది. తాజాగా సెక్యూర్డ్, రేటెడ్, లిస్టెడ్ రిడీమబుల్, నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల రెండో పబ్లిక్ ఇష్యూను ప్రారంభించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ తొలి ఎన్సీడీ ఇష్యూ రూ. 800 కోట్లు మొదటి రోజే పూర్తి సబ్ స్క్రైబ్ అయింది. ఇదే విషయాన్ని అదానీ గ్రూప్ సీఎఫ్ఓ జుగేశిందర్ రాబీ సింగ్ వెల్లడించారు. "ఏఈఎల్ రెండో పబ్లిక్ ఎన్సీడీ ఇష్యూ, సమ్మిళిత మూలధన మార్కెట్ ల వృద్ధికి, దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల అభివృద్ధిలో రిటైల్ భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుతుంది. అదానీ పోర్ట్స్ , సెజ్ , అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పవర్, అదానీ గ్రీన్ ఎనర్జీతో పాటు ఇప్పుడు అదానీ సంస్థ.. విమానాశ్రయాలు, రోడ్లు, డేటా సెంటర్ లు, గ్రీన్ హైడ్రోజన్ పర్యావరణ వ్యవస్థ ఇలా ప్రతి రంగంలోనూ మౌలిక సదుపాయాల కల్పనను విజయవంతంగా అందుకుంటోంది. ఈ ఒక్కో విభాగం భారత్ ను 5 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ దిశగా నడిపిస్తుంది" అని అదానీ గ్రూప్ సీఎఫ్ఓ జుగేశిందర్ రాబీ సింగ్ తెలిపారు. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం లిస్టెడ్ డెట్ ప్రోడక్ట్ ను అందిస్తున్న ఏకైక కార్పొరేట్ సంస్థ ఏఈఎల్ మాత్రమే కావడం విశేషం. ఈ విధానం ద్వారా వ్యక్తిగత, నాన్-ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ లకు భారత్ మౌలిక సదుపాయాల వృద్ధిలో పాల్గొనడానికి ఒక అరుదైన అవకాశాన్ని కల్పిస్తుంది. ఇటీవల రేటు తగ్గింపులు, తక్కువ వడ్డీ రేట్లు, స్థిరమైన, ఫిక్స్‌డ్- ఇన్ కమ్ మార్గాలను కోరుకునే పెట్టుబడిదారులకు ఇది సరైన సమయంగా చెప్పొచ్చు. ఇష్యూ బేస్ సైజు రూ. 500 కోట్లు, అదనంగా రూ. 500 కోట్ల వరకు ఓవర్-సబ్‌స్క్రిప్షన్ ను నిలుపుకునే అవకాశం ఉంది ("గ్రీన్ షూ ఆప్షన్") మొత్తం రూ. 1,000 కోట్ల వరకు ఉంటుంది ("ఇష్యూ" లేదా "ఇష్యూ సైజు"). ఈ ఇష్యూ జూలై 9, 2025న ప్రారంభమై జూలై 22, 2025న ముగుస్తుంది. ముందుగా ముగించే లేదా పొడిగించే అవకాశం కూడా ఉంది. ఎన్సీడీల ముఖ విలువ ఒక్కొక్కటి రూ. 1000. ప్రతి దరఖాస్తు కనీసం 10 ఎన్సీడీలకు, ఆ తర్వాత 1 ఎన్సీడీ మల్టిప్లైలో ఉండాలి. కనీస దరఖాస్తు పరిమాణం రూ. 10,000 అవుతుంది. ఇష్యూ నుండి వచ్చే ఆదాయంలో కనీసం 75శాతం కంపెనీ తీసుకున్న ప్రస్తుత రుణాన్ని పూర్తిగా లేదా కొంత భాగాన్ని ముందుగా చెల్లించడానికి లేదా తిరిగి చెల్లించడానికి ఉపయోగిస్తారు. మిగిలిన నిధులను (గరిష్టంగా 25% వరకు) సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగిస్తారు. నువామా వెల్త్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్, ట్రస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్, టిప్సన్స్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఇష్యూకు లీడ్ మేనేజర్ లుగా వ్యవహరిస్తున్నాయి.
నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ లను ప్రారంభించినట్లు ప్రకటించిన అదానీ గ్రూప్
July 06, 2025
0
Tags