ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని రంగరాయ వైద్యకళాశాల ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించి వైద్యారోగ్యశాఖ అధికారులు సీఎంకు నివేదిక అందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ల్యాబ్ టెక్నీషియన్లు జిమ్మీ రాజు, గోపాలకృష్ణ, ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. రంగరాయ వైద్యకళాశాలలో బీఎస్సీ, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సుల విద్యార్థినుల పట్ల కొందరు సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అంశం వెలుగుచూసింది. ముఖ్యంగా ల్యాబ్ సహాయకుడు ఒకరు, మరో ఉద్యోగి వికృత చేష్టలపై కళాశాల ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు అందింది. ఈ నెల 8న కొందరు విద్యార్థినులు ఫ్యాకల్టీ వద్ద విలపించడంతో కళాశాల అంతర్గత కమిటీ ద్వారా విచారణ జరిపించారు. మైక్రోబయాలజీ, పాథాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాల్లో కొందరు సిబ్బంది తమ పట్ల అసభ్యంగా వ్యవహరించిన తీరును దాదాపు 50 మంది విద్యార్థినులు కమిటీ ముందు చెప్పారు. ఈ విషయాన్ని కళాశాల విద్యార్థినులు కొందరు 'ఈనాడు' దృష్టికి తీసుకువచ్చారు. సిబ్బందిలో ఇద్దరు వ్యక్తులు తమను వేధించినట్లు విచారణలో తెలిపామన్నారు.
వైద్యకళాశాల ఘటన నిందితులపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశం
July 11, 2025
0
Tags