లండన్ వేదికగా జరుగుతన్న వింబుల్డన్ ఉమెన్స్ విభాగంలో, టైటిల్ ఫేవరేట్ గా ఉన్న సబలెంకను సెమీస్ లో అమెరికా ప్లేయర్ అనిసిమోవా ఓడించింది. దీంతో టైటిల్ రేసులో ఇప్పటివరకు బలమైన ఫేవరేట్ గా నిలిచిన సబలెంక, చివరకు టోర్నీని వీడాల్సి వచ్చింది. మొదటి సెట్లో తొలి నాలుగు పాయింట్లతో సమానంగా ఉండగా, ఆ తర్వాత అనిసిమోవా బ్రేక్ సాధించి 5-4గా తీసుకెళ్లింది. ఆ తరవాత సర్వీస్ కూడా నిలబెట్టుకోవడంతో, 6-4తో మొదటి సెట్ విజయం సాధించింది. ఇక 2వ సెట్లో సబలెంక పుంజుకుని సెట్ ను కాపాడుకుంది. కానీ 3వ సెట్ లో మళ్లీ వరుస తప్పిదాలు చేసింది. ముఖ్యంగా సర్వీస్ లు, డబుల్ ఫాల్ట్ చేసి గేమ్ పాయింట్స్ అన్నీ అనిసిమోవాకి ఇచ్చింది. దీంతో వచ్చిన ఛాన్సులను సద్వినియోగం చేసుకున్న అనిసిమోవా 3వ సెట్ కూడా 6-4తో గెలిచి.. కెరీర్లో మొదటిసారి గ్రాండ్ స్లామ్ ఫైనల్ చేరింది. ఇక ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన సబలెంక, సెమిస్ లోనే తన ప్రస్థానాన్ని ముగించింది. మరో గేమ్ లో ఫైనలిస్టుగా స్వీయటెక్ నిలిచింది. జులై 13న వింబుల్డన్ ఫైనల్ జరుగుతోంది.
టైటిల్ ఫేవరేట్ సబలెంకపై అనిసిమోవా విజయం
July 11, 2025
0
Tags