బ్రిటన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశంతో చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం తెలిసిందే. 'ఎఫ్‌టీఏ'పై సంతకాల అనంతరం ఇరుదేశాల నేతల ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆంగ్లంలో ప్రసంగిస్తుండగా దాన్ని అనువదిస్తున్న హిందీ ట్రాన్స్‌లేటర్ కాస్త ఇబ్బంది పడ్డారు. దీన్ని గుర్తించిన ప్రధాని మోడీ ''ఇబ్బంది పడకండి. అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలను ఉపయోగించొచ్చు. దాని గురించి చింతించకండి'' అని పేర్కొన్నారు. జరిగిన దానికి అనువాదకురాలు క్షమాపణలు చెప్పగా పర్లేదంటూ పరిస్థితిని చక్కదిద్దారు. ఇదంతా గమనించిన బ్రిటన్ ప్రధాని స్టార్మర్ చిరునవ్వులు చిందించారు. రెండు దేశాల సందర్శనలో భాగంగా ప్రధాని మోడీ ప్రస్తుతం బ్రిటన్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా 'సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం' పేరుతో చేసుకున్న ఒప్పందంపై ఇరుదేశాల వాణిజ్యశాఖ మంత్రులు సంతకాలు చేశారు. దీని ద్వారా భారత్- బ్రిటన్ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడంతోపాటు ఇరుదేశాల మధ్య ఏటా 34 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుందని అంచనా.
ఇబ్బంది పడకండి, అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలను ఉపయోగించొచ్చు : అనువాదకురాలితో మోడీ
July 24, 2025
0
Tags