గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాల వల్లే తెలంగాణకు నష్టం వాటిల్లిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో తెలంగాణ నష్టపోయినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చిద్దామని కేసీఆర్‌కు సూచించానని, సవాల్ చేయలేదని సీఎం రేవంత్ స్పష్టత ఇచ్చారు. కేసీఆర్ పాలనలోనే కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లిందని సీఎం రేవంత్ చెప్పారు. నీళ్లు, నిధుల శాఖలను కేసీఆర్ కుటుంబమే పదేళ్లు నిర్వహించిందని గుర్తు చేసిన సీఎం రేవంత్.. చచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవడానికే కేసీఆర్ నీళ్ల సెంటిమెంట్ రేపుతున్నారన్నారు. చచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవడానికే కేసీఆర్ నానా పాట్లు పడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరంపై వాస్తవాలతో కూడిన నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారని చెప్పిన సీఎం రేవంత్, నివేదికల వాస్తవ పరిస్థితులను కేంద్రం ఎదుట ఉంచామన్నారు. తెలంగాణ సాధన కోసం ఎంతోమంది కొట్లాడారని, తెలంగాణ వచ్చాక కేసీఆర్ పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారని రేవంత్ గుర్తు చేశారు.
కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చిద్దామని కేసీఆర్‌కు సూచించా, సవాల్ చేయలేదు
July 09, 2025
0
Tags