ఏనుగుల సంచారంపై వాట్సప్‌ గ్రూపుల ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలి !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఏనుగు గుంపుల సంచారంపై ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మంగళవారం సమీక్ష నిర్వహించారు. సోమవారం అర్ధరాత్రి తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో ఏనుగులు సంచరించిన విషయం తెలిసిందే. పంప్‌ హౌస్‌ వద్ద 11 ఏనుగులు సమీపంలోని పంట పొలాలను ధ్వంసం చేశాయి. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఏనుగులు సంచరిస్తున్న ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని అధికారులకు పవన్‌ కల్యాణ్‌ సూచించారు. గ్రామస్థులతో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసి ముందస్తు సమాచారం ఇవ్వాలని చెప్పారు. అటవీ శాఖ సిబ్బంది ఆయా గ్రామాల్లో నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. ఏనుగుల గుంపు పొలాల మీదకి రాకుండా, అటవీ ప్రాంతంలోకి పంపించే చర్యలను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)