జపాన్ లో తీరానికి కొట్టుకువచ్చిన భారీ తిమింగళాలు

Telugu Lo Computer
0


నాలుగు తిమింగళాలు చీబాలోని తతయేమా తీరానికి వచ్చినట్లు జపాన్ మీడియా పేర్కొన్నది. రష్యాలోని కామ్‌చట్కా ద్వీపంలో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర జపాన్‌లో ఉన్న ఇషినోమాకి తీరం వద్ద సుమారు 50 సెంటీమీటర్ల ఎత్తులో అలలు వస్తున్నాయి. చిబా ప్రావిన్సులోని కుజుకురి బీచ్ వద్ద ఉన్న నదిలోకి సునామీ అలలు వస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. తొలి సునామీ అలలు చేరుకున్నా మరికొన్ని గంటల్లో భారీ సునామీలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు జపనీస్ అధికారులు చెబుతున్నారు. భూకంపం వచ్చిన ఒక రోజు తర్వాత కూడా భారీ సైజులో ఉండే సునామీలు తీరాన్ని తాకే ప్రమాదం ఉన్నట్లు జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. సునామీలను పరిశీలిస్తున్నామని, వాటి నుంచి రిస్క్ ఉన్నట్లు అధికారులు చెప్పారు. సునామీలు అకస్మాత్తుగా అటాక్ చేస్తాయని, వార్నింగ్ ఎత్తివేసే వరకు సురక్షిత ప్రాంతాలను విడిచి వెళ్లరాదు అని అధికారులు పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)