కృష్ణా నది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీలోకి భారీ వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీకి 65,000 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో అధికారులు 35 గేట్లు ఎత్తి నీటి దిగువకు వదిలారు. ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరదకు అనుగుణంగా నీటిని కిందకు విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో దాదాపు మూడు లక్షల క్యూసెక్కుల వరకు పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నదీ పరీవాహక లోతట్టు ప్రాంతంలోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గంట గంటకు పెరుగుతోందని, నదిలోకి వెళ్లవద్దని, పశువులను నది సమీపంలోకి తీసుకెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాగా, ఈ బ్యారేజీని 5.8 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి నిర్మించారు .
ప్రకాశం బ్యారేజ్ వద్ద 35 గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల
July 30, 2025
0
Tags