ఉద్యోగ, ఉపాధి కల్పనకు మిషన్ మోడ్ విధానంలో నైపుణ్యం పోర్టల్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తాం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో  'నైపుణ్యం' పోర్టల్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి నారా లోకేశ్‌ ఆదేశించారు. నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులతో ఉండవల్లిలోని నివాసంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. ఈ మేరకు 'ఎక్స్‌'లో ఆయన పోస్ట్‌ చేశారు. ''ఉద్యోగ, ఉపాధి కల్పనకు మిషన్ మోడ్ విధానంలో నైపుణ్యం పోర్టల్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తాం. 90 రోజులపాటు ఈ కార్యక్రమం చేపడతాం. ఈ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా రెజ్యూమ్‌ సిద్ధమయ్యేలా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించాను. ఇటీవల దిల్లీ పర్యటన అనంతరం ఐటీఐల అభివృద్ధికి హబ్ అండ్ స్పోక్ విధానంలో కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం ద్వారా రూ.600 కోట్లు కేటాయించాం'' అని లోకేశ్‌ పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)