ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం నుంచి చెన్నైకి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు త్వరలోనే ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడించారు. నరసాపురం - చెన్నై మార్గంలో త్వరలోనే వందే భారత్ రైలును ప్రారంభిస్తామని తెలిపారు. బుధవారం నరసాపురం రైల్వేస్టేషన్‌లో నరసాపురం - తిరువణ్ణామలై ప్రత్యేక రైలు సర్వీసును కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ప్రారంభించారు. అనంతరం అదే రైలులో భీమవరం వరకూ ప్రయాణించారు. ఈ ప్రత్యేక రైలు ద్వారా ఉభయ గోదావరి జిల్లా వాసులకు లబ్ది చేకూరుతుందని శ్రీనివాసవర్మ తెలిపారు. అలాగే తిరుపతి, అరుణాచలం వెళ్లేందుకు అవకాశం కలుగుతుందన్నారు. రాబోయే రోజులలో వారానికి మూడు రోజులు నరసాపురం - అరుణాచలం ప్రత్యేక రైలు నడిపేలా చర్యలు తీసుకుంటామన్నారు.
నరసాపురం నుంచి చెన్నైకి వందే భారత్ ఎక్స్‌ప్రెస్
July 10, 2025
0
Tags