తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల నియమాలు అమల్లో ఉన్నప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలు నిర్వహించారు. దీనితో ట్రాఫిక్ జామ్ అయింది, ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ కారణంగా పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేశారు. ఈ కేసు విచారణ సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కోర్టుకు హాజరుకాలేదు. దీంతో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. విచారణ తేదీని వచ్చే ఈ నెల 16కి వాయిదా వేసింది.
ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
July 10, 2025
0
Tags