పూణెలో యువతిపై డెలివరీ బాయ్ ఘాతుకం

Telugu Lo Computer
0


హారాష్ట్ర లోని పూణెలోని కొంధ్వాలో ఒక యువతి అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటుంది. డెలివరీ బాయ్ పార్సీల్ ఇవ్వడానికి వచ్చి యువతిను పెన్ కావాలని అడిగాడు. ఆమె పెన్ కోసం లోపలికి వెళ్లేగా, ఆమె వెనకాలే వెళ్లి ఆమె ముఖంపై ఒక్కసారిగా పెప్పర్ స్ప్రై వేశాడు. దాంతో ఆమె కళ్లు తిరిగిపడిపోయింది. వెంటనే ఆమెపై అత్యాచారంకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఫోటోలు, సెల్ఫీలు తన ఫోన్ లో తీసుకున్నాడు. యువతి ఫోన్ తో సెల్ఫీ దిగి మరోసారి వస్తానని, ఈ విషయాన్ని బైటకు చెబితే పరిణామాలు సీరియస్ గా ఉంటాయని హెచ్చరించాడు. తర్వాత మెల్కొన్న మహిళ తనపై అఘాయిత్యం జరిగిందని తెలుసుకుని వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పింది. ఆ తర్వాత పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో.. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. సీసీటీవీ కెమెరాల్లో..నిందితుడి దృశ్యాలు రికార్డు అయ్యాయని, అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)