మహారాష్ట్ర లోని బీడ్ జిల్లా పంధర్‌పూర్ నుంచి అకోట్‌కు వెళ్తున్న స్టేట్ ట్రాన్స్ పోర్ట్ బస్సు డ్రైవర్, కండక్టర్ మద్యం తాగి ఉన్నట్లు ప్రయాణికులు గుర్తించారు. ఇద్దరూ మద్యం తాగి ఉండటం వల్ల బస్సులోని 37 మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయి. శనివారం నాడు MH-14-6140 నంబర్ గల ఈ బస్సు అకోట్ డిపో నుంచి వార్కారీకి ప్రయాణికులతో బయలుదేరినప్పుడు ఈ సంఘటన జరిగింది. బస్సు డ్రైవర్ సంతోష్ రహతే, కండక్టర్ సంతోష్ ఝలతే డ్యూటీ సమయంలో మద్యం సేవించి ఉన్నారు. మార్గమద్యంలో బస్సు బీడ్ జిల్లా సరిహద్దుకు చేరుకున్నప్పుడు, డ్రైవర్ బస్సును సరిగ్గా నడపలేకపోతున్నాడని, కండక్టర్ తన సీటుపై పడుకుని దొర్లుతుండడాన్ని ప్రయాణికులు గమనించారు. అనుమానం వచ్చిన ప్రయాణికులు బస్సును ఆపి బీడ్ రవాణా శాఖకు, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అధికారులు వెంటనే అప్రమత్తమై సంఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్, కండక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో, ఇద్దరూ మద్యం సేవించినట్లు అంగీకరించారు. వారిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపారు. నివేదిక వచ్చిన తర్వాత, సస్పెన్షన్, తొలగింపుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మద్యం సేవించి విధులకు హాజరైన డ్రైవర్, కండక్టర్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు.
మద్యం మత్తులో స్టేట్ ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్, కండక్టర్ : అదుపులోకి తీసుకున్న పోలీసులు
July 12, 2025
0
Tags