ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 25 శాతం వరకు క్యాష్ బ్యాక్

Telugu Lo Computer
0


యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది. దీని సాయంతో రీఛార్జ్ వంటి యుటిలిటీ చెల్లింపులపై బంపర్ క్యాష్ బ్యాక్ పొందడం ఈ కార్డు ప్రత్యేకత. ఎయిర్‌టెల్‌ రీఛార్జ్‌లలో డబ్బులు ఆదా చేయాలనుకుంటే, ఈ కార్డు సరైన ఎంపిక. దీనితో ఇతర కంపెనీల రీఛార్జ్ లపై కూడా డిస్కౌంట్లు పొందవచ్చు. ఈ క్యాష్‌ బ్యాక్‌ కోసం యూజర్లు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రీఛార్జ్‌ కోసం ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో చెల్లించినట్లయితే ఫ్లాట్ 25 శాతం క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుంది. అదే సమయంలో ఇతర రీఛార్జ్ లపై కూడా 10 శాతం క్యాష్ బ్యాక్ ప్రయోజనాన్ని అందిస్తోంది. ఈ క్యాష్ బ్యాక్ 60 రోజుల్లో ప్రాసెస్ అయి నేరుగా క్రెడిట్ స్టేట్ మెంట్ లో ప్రతిబింబిస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)