ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) ఇటీవల కాలంలో టెక్ రంగాన్ని శాసించే స్థాయికి చేరాయి. కీలకమైన ఆర్దిక, ఆరోగ్య, రవాణా రంగాల్లో ఏఐ, ఎంఎల్ ప్రభావం పెరిగింది. ఫలితంగా ఈ ఏఐ, ఎంఎల్ నిపుణులకు డిమాండ్ బాగా కనిపిస్తోంది. మారుతున్న కాలం తో పాటుగా పెరుగుతున్న పోటీ కారణంగా ఏఐ నైపుణ్యం కీలకంగా మారింది. దీంతో ఈ ఏఐ - ఎంఎల్ కోర్సులు చేసిన వారికి భవిష్యత్ బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. కృత్రిమ మేధస్సు ద్వారా సేవా రంగంతో పాటుగా లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ ఫోకసింగ్, రోబోటిక్స వంటివి ఉంటాయి. అదే విధంగా మిషన్ లెర్నింగ్ ద్వారా స్పష్టమైన ప్రోగ్రామింగ్ లేకుండానే రియల్ టైం డేటాను అర్దం చేసుకొని అవసరమైన విధంగా స్పందిస్తూ కంప్యూటర్ వ్యవస్థలకు శిక్షణ ఇవ్వడానికి దోహదం చేస్తుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మన మార్కెట్ లో ఏఐ - ఎంఎల్ టెక్నాలజీ అవసరంగా మారాయి. ఆరోగ్య సంరక్షణ, సేవా రంగా, వ్యాధి నిర్ధారణ, ఔషధ ఆవిష్కరణలో ఏఐ - ఎంఎల్ అప్లికేషన్ల నుంచి సులభంగా సేవలు అందుతున్నాయి. ఆర్దిక పరమైన మోసాలను గుర్తించటానికి ఏఐ లోని అల్గోరిథంలు సహకరిస్తున్నాయి. పెరుగుతున్న పోటీకి అనుగుణంగా సాంకేతికత వినియోగం అని వార్యంగా మారుతోంది. దీంతో, ఏఐ, ఎంఎల్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ప్రముఖ సంస్థలు ఏఐ, ఎంఎల్ వినియోగానికి భారీగా వెచ్చిస్తున్నాయి. ఈ కోర్సులు ప్రోగ్రామింగ్, డేటా విశ్లేషణ, మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం ల రూపకల్పనలో శిక్షణ ఇస్తాయి. పైథాన్ .. ఆర్ వంటి ప్రోగ్రామింగ్ భాషలలో, గణాంక విశ్లేషణ, డేటా ప్రీప్రాసెసింగ్, విజువలైజేషన్ పద్ధతులలో నైపుణ్యం సాధిస్తారు. డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్‌లో కూడా శిక్షణ ఇస్తారు. ఏఐ, ఎంఎల్ కోర్సుల గ్రాడ్యుయేట్లు టెక్నాలజీ, హెల్త్‌కేర్, ఫైనాన్స్, ఇ-కామర్స్, తయారీ రంగాల్లో భారీ వేతనాలతో మంచి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కోర్సులకు పెరిగిన డిమాండ్
July 02, 2025
0
Tags