హైదరాబాద్ నగరంలోని ఓ ఇంట్లో మనిషి అస్థిపంజరం ఉండటం కలకలం రేపింది. హబీబ్‌నగర్ పీఎస్ పరిధిలోని నాంపల్లి మార్కెట్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సౌత్ వెస్ట్‌జోన్ డీసీపీ చంద్రమోహన్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఏడేళ్లుగా ఆ ఇంటిలో ఎవరూ లేరని, యజమాని విదేశాల్లో ఉన్నారని స్థానికులు తెలిపారు. అస్థిపంజరం ఎవరిదనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్లూస్‌టీమ్ అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించింది. ఇటీవల ఓ యువకుడు శిథిలావస్థలో ఉన్న ఆ ఇంటిలోకి వెళ్లినట్లు సమాచారం. లోపల అస్థిపంజరాన్ని వీడియోలో రికార్డు చేశాడని, అది వైరల్ కావడంతో యువకుడిని పోలీసులు విచారించినట్లు తెలిసింది. క్రికెట్ బాల్ ఆ ఇంట్లో పడటంతో తీసుకునేందుకు వెళ్లానని యువకుడు తెలిపినట్లు సమాచారం.
నాంపల్లి మార్కెట్ ప్రాంతంలో ఇంటిలో అస్థిపంజరం !
July 14, 2025
0
Tags