బాలాపూర్ ప్లాస్టిక్ కంపెనీలో చెలరేగిన మంటలు

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని బాలాపూర్ లో ఉన్న ఓ ప్లాస్టిక్ పరిశ్రమ లో ఈ తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. అయితే ఘటన జరిగినపుడు కంపెనీలో ఎవ్వరూ లేకపోవడం తో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదానికి గల కారణాలను అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలతో కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. భయం గుప్పిట్లో పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని భద్రత ప్రమాణాలు పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు


Post a Comment

0Comments

Post a Comment (0)