సింగపూర్‌ ప్రభుత్వంతో మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్నాం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ - సింగపూర్‌ బిజినెస్‌ ఫోరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని మాట్లాడుతూ సింగపూర్‌ ప్రభుత్వంతో మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్నామన్నారు. ఎలాంటి ఉత్తమ విధానాలైనా సింగపూర్‌ నుంచే వస్తున్నాయని అన్నారు. ''స్వాతంత్ర్యం తర్వాత మన నాయకులు మిళిత, సోషలిస్టు ఆర్థిక విధానాలు అవలంబించారు. 1947లోనే ఆర్థిక విధానాల్లో పోటీపడి ఉంటే భారత్‌ ఇప్పుడు ఎలా ఉండేదో ఆలోచించండి. ఎట్టకేలకు 1991లో ఆర్థిక సంస్కరణల బాట పట్టింది. భారత్‌ సంస్కరణలు చేపట్టిన 13 ఏళ్లకు చైనా అదే విధానం అవలంబించింది. 2014లో ఏపీ రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ కోసం ఇక్కడికి వచ్చా. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దేందుకే మళ్లీ వచ్చాను. సింగపూర్‌లో అవినీతి అనేది ఉండదని విన్నాను. నేను తొలిసారి సీఎం అయినప్పుడు హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో సింగపూర్‌ టౌన్‌షిప్‌ ఏర్పాటు చేయాలని కోరా. ఇప్పుడు ఏపీలో సింగపూర్‌ మాదిరిగా నగరాన్ని నిర్మించాలని సంకల్పించా. ఉచితంగా రాజధాని మాస్టర్‌ప్లాన్‌ ఇచ్చేందుకు సింగపూర్‌ ముందుకు వచ్చింది. అభివృద్ధిలో భారత్‌ వేగంగా ముందుకు సాగుతోంది. అదే బాటలో ఏపీ కూడా పయనించాల్సి ఉంది. పెట్టుబడులకు ఇక్కడి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. మేం సులభతర వాణిజ్య విధానాలను ప్రోత్సహిస్తున్నాం. ప్రస్తుతం స్పీడ్‌ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌పై దృష్టి పెట్టాం. నవంబర్‌ 14, 15 తేదీల్లో సీఐఐ, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా సదస్సు నిర్వహించనున్నాయి. దీనికి సింగపూర్‌ ప్రతినిధులను ఆహ్వానిస్తున్నా''అని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)