డానిష్ ఫైబర్ టెక్నాలజీ సాయంతో ఆంధ్రప్రదేశ్ లో రహదారుల నిర్మాణం

Telugu Lo Computer
0


విదేశాల్లో ప్రస్తుతం వాడుతున్న డానిష్ ఫైబర్ టెక్నాలజీ సాయంతో ఆంధ్రప్రదేశ్ లో రహదారులకు కొత్త రూపు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. డానిష్ ఫైబర్ టెక్నాలజీతో కొత్త రోడ్లను నిర్మించే ప్రాజెక్టుకు ఇవాళ బనగానపల్లెలో రోడ్లు, భవనాలశాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఇవాళ శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే దీన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తారు. మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి నియోజకవర్గం బనగానపల్లెలోని సంజామల మండలంలో ముదిగేడు - సంజామల మధ్య అధునాతన టెక్నాలజీతో 2 వరుసల రహదారి నిర్మాణ పనులను ఇవాళ ప్రారంభిస్తారు. డానిష్ ఫైబర్ టెక్నాలజీతో రాష్ట్రంలో తొలిసారి నిర్మించే ఈ రోడ్డుకు రోడ్లు,భవనాల శాఖ ప్రయోగాత్మకంగా చేపడుతోంది. డానిష్ ఫైబర్ టెక్నాలజీ వాడకంతో రోడ్లు సుస్ధిరంగా, నాణ్యతతో ఎక్కువ కాలం మన్నిక కలిగి, తీవ్ర వాతావరణ పరిస్థితులు తట్టుకుని నిలబడేలా ఉంటుంది. అలాగే తక్కువ వ్యయం, నిర్వహణ కూడా ఇందులో ప్రత్యేకతలు. ప్రపంచ వ్యాప్తంగా రోడ్ల అభివృద్ధిలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటూ ఇవాళ డానిష్ ఆస్ఫాల్ట్ రీ-ఇన్ఫోర్సింగ్ ఫైబర్ టెక్నాలజీ తో పైలట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించడం రాష్ట్రానికే గర్వకారణమని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తెలిపారు. డెన్మార్క్ కు చెందిన ఈ ఆధునాతన టెక్నాలజీని ప్రపంచ ప్రఖ్యాతి చెందిన హీత్రో ఎయిర్‌పోర్ట్, దుబాయ్ మెట్రో, A7 మోటార్‌వే (జర్మనీ) లాంటి ప్రాజెక్టుల్లో ఇప్పటికే విజయవంతంగా ఉపయోగించారని తెలిపారు. ఐబీక్యూ జర్మనీ, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో విజయవంతంగా ఈ సాంకేతికత వాడుతున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా అరమిడ్, పాలియోలెఫిన్ అనే అధిక బలం కలిగిన ఫైబర్లు ఆస్ఫాల్ట్ మిశ్రమంలో కలుపుతారు. వీటి వల్ల సాధారణంగా రహదారులపై పడే గుంతలు, గోతులు, రోడ్లపై చీలికలు వంటి ధీర్ఘకాలిక సమస్యలకు చెక్ పెట్టే అవకాశం ఉంది.. తారు రోడ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అధునాతన విధానం ఇది. కొత్త, పాత తారు రోడ్ల నిర్మాణంలో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ టెక్నాలజీ ద్వారా తారు రోడ్లపై 100 శాతం గుంతలను నివారించవచ్చు. సాంప్రదాయ తారు కంటే ఈ ఫైబర్ కలిపిన తారు చాలా బలంగా ఉంటుంది. ముఖ్యంగా రోడ్లపై పగుళ్లు, చీలికలు, ప్రకృతి వైఫరీత్యాలు వంటి కఠిన వాతావరణ పరిస్థితులను తట్టుకుని సుదీర్ఘ కాలం పనిచేస్తుంది. అధిక వాహనాలతో నిరంతరాయంగా రద్దీగా ఉండే రోడ్లపై అధిక ఒత్తిడి పడకుండా ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ టెక్నాలజీ ద్వారా రోడ్ల నాణ్యతా ప్రమాణాలు పెరగడంతో పాటు, రహదారుల జీవితకాలం కూడా 50 శాతం పైగా పెరగనుంది. ఈ అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ద్వారా రోడ్ల మరమ్మతులకు చెక్ పెడితే, నిరంతరాయంగా గతుకులు, గుంతలు లేని రహదారులపై సాఫీగా, వేగంగా ప్రయాణించే వెసులుబాటు రానుంది. అది పరోక్షంగా ట్రాఫిక్ సమస్యలకు చాలా మేరకు తగ్గిస్తుందని అంచనా. హెవీ లోడ్ లతో కూడిన రవాణా వాహనాలు రహదారులపై వెళుతున్న క్రమంలో సాధారణంగా ఆయా రోడ్లపై ఒకే ప్రాంతంలో ఒక్కసారిగా అధిక భారం పడి, అది అంతిమంగా రోడ్లు కుంగిపోవడం, గుంతలు పడి పాడైపోవడం, పగుళ్లు రావడం జరుగుతోంది. అదే ఈ డానిష్ ఫైబర్ టెక్నాలజీ రోడ్లలో ఉన్న ఫైబర్... హెవీ లోడ్స్, కంటెనర్ల వంటి భారీ వాహనాల భారాన్ని అన్ని వైపుల నుంచి (త్రి డైమన్షనల్ గా) ఎదుర్కొవడం వల్ల రోడ్లపై ఆయా ప్రాంతాల్లో ఏక కాలంలో ఒకచోటే ఎక్కువ భారం పడకుండా ఈ టెక్నాలజీ అడ్డుకుంటుంది.. తద్వారా ఈ రోడ్లపై ఒత్తిడి తగ్గి, ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది. ఈ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ప్రభుత్వాలపై మరమ్మతుల భారం తగ్గడం ద్వారా పరోక్షంగా మెయింటెనెన్స్ కూడా భారీగా తగ్గుతుంది. కొత్త యంత్రాలు అవసరం లేకుండానే ఈ టెక్నాలజీ ఉపయోగించుకునే అవకాశం ఉండటం, ఈ రోడ్లపై వాడే డానిష్ ఫైబర్ తిరిగి వినియోగించుకునే వీలు ఉన్న నేపథ్యంలో ఇది పర్యావరణ పరంగా కూడా చాలా అనుకూలమైనది

Post a Comment

0Comments

Post a Comment (0)