హైదరాబాద్ మాదాపూర్‌లో తండ్రి మందలించాడని మనస్తాపానికి గురైన కొడుకు తండ్రిని హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల ప్రకారం మాదాపూర్‌కు చెందిన హనుమంతు అనే వ్యక్తి తన కొడుకు రవీందర్ చదువు కోసం సుమారు ఆరు లక్షల రూపాయలు ఇచ్చాడు. అయితే ఆ మొత్తాన్ని చదువుల మీద కాకుండా, బెట్టింగ్ యాప్స్‌లో పెట్టుబడి పెట్టి పోగొట్టేశాడు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి తీవ్రంగా మందలించాడు. దీంతో కోపంతో ఊగిపోయిన రవీందర్ తన తండ్రిని హత్య చేసి, అది ఆత్మహత్యగా మలచే ప్రయత్నం చేశాడు. తర్వాత మృతదేహాన్ని స్వస్థలమైన వనపర్తి తీసుకెళ్లి, అక్కడ కర్మకాండలు పూర్తి చేయాలని చూస్తుండగా, ఈ వ్యవహారంపై బంధువులకు అనుమానం వచ్చి, పోలీసులకు సమాచారం అందించారు. ఆ మేరకు పోలీసులు విచారణ జరిపారు. అప్పటివరకు తండ్రిని తానే హత్య చేశానని ఒప్పుకోలేదు. దర్యాప్తు లోతుగా జరపడంతో చివరకు ఒప్పుకుని, తానే తండ్రిని చంపినట్టు అంగీకరించాడు. వెంటనే అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
బెట్టింగ్ ఆడొద్దని మందలించినందుకు తండ్రిని చంపిన కొడుకు !
July 02, 2025
0
Tags