అత్యాధునిక హంగులతో త్వరలో రవితేజ మల్టీ ప్లెక్స్ ప్రారంభం

Telugu Lo Computer
0


సినిమా రంగంలో స్టార్ హీరోలుగా వెలుగొందుతోన్న వారిలో చాలా మంది థియేటర్ బిజినెస్ రంగంలోనూ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే ఏఎంబీ స్ తో మహేష్ బాబు, ఏఏఏ స్ తో అల్లు అర్జున్ హైదరాబాద్ లో మల్టీ ప్లెక్స్ లు ఏర్పాటు చేశారు. విజయ్ దేవరకొండతో ఏవీడీ స్ పేరుతో మల్టీ ప్లెక్స్ ను ఏర్పాటు చేశాడు. త్వరలోనే ఏపీలోనూ ఈ మల్టీ ప్లెక్స్ లు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడీ మల్టీ ప్లెక్స్ బిజినెస్ లోకి నటుడు  రవితేజ కూడా అడుగు పెట్టాడు. కొన్ని నెలల క్రితమే హీరో రవితేజతో కలిసి ఏసియన్ సంస్థ ఓ మల్టీప్లెక్స్ నిర్మాణాన్ని ప్రకటించింది. హైదరాబాద్ శివారు వనస్థలిపురం ప్రాంతంలో ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం జరుగుతోంది. త్వరలోనే ఈ మల్టీప్లెక్స్‌ను గ్రాండ్‌గా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. కాగా ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవాన్ని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లుతో ప్రారంభించాలని అనుకుంటున్నారట. ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ జూలై 24న విడుదల కానుంది.  కాగా ఏఆర్ టీ మల్టీప్లెక్స్‌ను అత్యాధునిక సాంకేతికతతో నిర్మించినట్లు సమాచారం సుమారు 57 అడుగుల వెడల్పుతో భారీ స్క్రీన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, ప్రేమికులకు సరికొత్త అనుభూతిని అందించే విధంగా టిక్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయయని తెలుస్తోంది. ఇప్పటికే పలు సార్లు టెస్టింగ్ ప్రక్రియ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. త్వరలో టాలీవుడ్ ప్రముఖులతో ఈ మల్టీ ప్లెక్స్ ను గ్రాండ్ గా ఓపెనింగ్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది.


Post a Comment

0Comments

Post a Comment (0)