తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బోంగ్లూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు పై రోడ్డు TS07 HW 5858 అనే నంబర్ గల బెలినో కారు లారీని వెనుక వైపు నుంచి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. పెద్ద అంబర్ పెట్ నుండి బోంగ్లూర్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రత కారణంగా ఇద్దరి మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోయాయి. పోలీసులు మూడు గంటల పాటు శ్రమించి మృతదేహాలను అతి కష్టం మీద బయటికి తీశారు. మృతదేహాలను పోలీసులు ఇబ్రహీంపట్నం మార్చురీకి తరలించారు.
బెలినో కారు లారీని ఢీ కొట్టడంతో నలుగురు మృతి
July 18, 2025
0
Tags