తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి రాజస్థాన్ కు సెపరేట్ ట్రెయిన్ సౌకర్యం ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను రాజస్థానీ కమ్యూనిటీకి చెందిన వివిధ సంఘాల సభ్యులు కోరారు. ఈ మేరకు ఢిల్లీలోని రైల్వే భవన్ లో హైదరాబాద్ కిరానా మర్చంట్ అసోసియేషన్; మహేశ్వరి సమాజ్ హైదరాబాద్ - సికింద్రాబాద్; కుమావత్ సమాజ్ తెలంగాణ; తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ మహేశ్వరి సభ; అఖిల భారతవర్షియ మహేశ్వరి మహాసభ మరియు హైదరాబాద్ - సికింద్రాబాద్ (జిల్లా) మహేశ్వరి సభ సభ్యులు కలిశారు. హైదరాబాద్ నుండి రాజస్థాన్‌కు కొత్తగా రోజువారీ రైలు సర్వీసును ప్రవేశపెట్టాలని సభ్యులు అభ్యర్థించారు. రాజస్థాన్ నుండి ఉపాధి, వ్యాపారం, విద్యా ప్రయోజనాల కోసం హైదరాబాద్ లో స్థిరపడిన పెద్ద సంఖ్యలోని ప్రజలకు ఈ డైరెక్ట్ రైలు సర్వీసు ప్రయోజనకరంగా ఉంటుందని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ డైరెక్ట్ రైలు సర్వీసు వారి స్వస్థలాలకు వెళ్లడానికి ఆర్థికంగా, సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉంటుందన్నారు. ఈ మేరకు వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ హైదరాబాద్ నుండి జోధ్‌పూర్ కు నాందేడ్, అకోలా, ఖాండ్వా, భోపాల్, ఉజ్జయిని, రత్లం, అజ్మీర్ మార్గం గుండా రోజువారీ రైలు సర్వీసును నడపడానికి సాధ్యాసాధ్యాలను వెంటనే పరిశీలించాలని సంబంధిత జోనల్ రైల్వే అధికారులను ఆదేశించారు. మరోవైపు ప్రస్తుతం ఉన్న బైవీక్లీ , వీక్లీ వారీగా ప్రయాణిస్తున్న రైళ్లు రద్దీగా ఉండే అహ్మదాబాద్ మార్గంలో నడుస్తున్నందున, కాచిగూడ నుండి భగత్ కి కోఠి (జోధ్‌పూర్) వరకు కొత్త డైరెక్ట్ రోజువారీ రైలు సర్వీసును నడపాలనే అభ్యర్థనను కేంద్ర మంత్రి ఆమోదించారు.
హైదరాబాద్ నుంచి రాజస్థాన్ కి ప్రతిరోజూ రైలు !
July 17, 2025
0
Tags