ఈఎంఐల భారంతో బాధపడుతున్న మధ్యతరగతి ప్రజలు

Telugu Lo Computer
0


దేశంలోని మధ్యతరగతి ప్రజలు పన్నులు, ద్రవ్యోల్బణం వంటి వాటి కంటే ఈఎంఐల భారంతో బాధపడుతున్నారని తాజా రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈఎంఐ ట్రాప్ భారతీయులను ఆర్థికంగా కుదేలు చేస్తోందని వెల్త్ అడ్వైజర్ తపస్ చక్రబొర్తి హెచ్చరించారు. మధ్యతరగతి ప్రజలు సంపాదించటం, అప్పులు చేయటం, అప్పులు తిరిగి చెల్లించటం, ఇదే మళ్లీ మళ్లీ చేయటం, ఎలాంటి సేవింగ్స్ లేకపోవటం, క్రెడిట్ కార్డులు స్వైప్ చేస్తూ తమకు తెలియకుండానే మధ్యతరగతి భారతీయులు అప్పుల చట్రంలో చిక్కుకుంటున్నారు. ఫోన్ కొనాలన్నా ఈఎంఐ, ఫ్రిజ్డ్ కావాలన్నా ఈఎంఐ, ఏసీ, సోఫా, సినిమా టిక్కెట్లు, విమాన ప్రయాణాలకూ మధ్యతరగతి ప్రజలు ఈఎంఐ వాడేస్తున్నారు. కనీసం కిరాణా సరుకులు కొనాలన్నా క్రెడిట్ కార్డలు గీకేస్తున్నారు. ఎలాంటి పేపర్ వర్క్ లేకుండా రుణం రావటంతో చాలా మంది లోన్ తీసుకోవటాన్ని ప్రజలు సర్వసాధారణమైన అంశంగా ఫీల్ అవుతున్నారు. కానీ పరిస్థితులు వాస్తవం కంటే దారుణంగా దిగజారుతున్నాయి. దేశంలో ప్రజల గృహ రుణం జీడీపీలో 42 శాతానికి చేరుకోవటం ఆందోళన కలిగిస్తోంది. అలాగే ఎలాంటి సెక్యూరిటీ లేకుండా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులపై వచ్చే రుణాలు, బైనౌ పే లేటర్, పే లేటర్ సర్వీసులు పరిస్థితులను మరింతగా దిగజారుస్తున్నాయి. దేశంలో ఉన్న 70 శాతం ఐఫోన్లు ఈఎంఐలపై కొన్నవే అనే విషయం చూస్తుంటేనే పరిస్థితి అర్థమౌతుంది. చిన్న రుణాలు తీసుకుంటున్న వారిలో 11 శాతం తిరిగి వాటిని చెల్లించటంలో విఫలం అవుతున్నారని తేలింది. ఈ పరిస్థితుల్లో ఒక్కో లేయర్ రుణాలను పేర్చుకుంటూ మధ్యతరగతి భారతీయులు కోలుకోలేని రుణాల ఊబిలోకి జారుకుంటున్నారని చక్రబొర్తి చెప్పారు. క్రెడిట్ కార్డ్ బిల్లులు, ఫోన్ ఈఎంఐ, బైక్ ఈఎంఐ అంటూ నెలకి కనీసం రూ.25వేల వరకు వచ్చిన ఆదాయాన్ని చెల్లింపులకు వాడుతున్నారు. దీంతో ఎలాంటి సేవింగ్స్ లేక ఉత్తి చేతులతో మిగులుతున్నారని హెచ్చరించారు. ఇలాంటి సమయంలో అనుకోకుండా అనారోగ్యం ఏర్పడితే ఇక అంతే, జీవితం మెుత్తం తలకిందులైపోతుందని హెచ్చరించారు. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య కాదని, మధ్యతరగతి ప్రజలు చేస్తున్న పనులు దేశాభివృద్ధిని కూడా దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వస్తున్న ఆదాయంలో ఈఎంఐలు 40 శాతం కంటే తక్కువగా ఉండేలా మధ్యతరగతి భారతీయులు జాగ్రత్త పడాలని సూచించారు. అలాగే కనీసం అత్యవసరాలకు ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటుకు నెలకు రూ.500 వెచ్చించాలన్నారు. అందరి ముందూ గొప్పగా, ఉన్నతంగా జీవిస్తున్నట్లు కనిపించటం కోసం రుణాలు తీసుకుని విసాలాలకు పోవద్దని చక్రబొర్తి మరీ మరీ హెచ్చరించారు. వీలైనంత త్వరగా డబ్బును సేవ్ చేయటం, సరైన మార్గాల్లో పెట్టుబడులు పెట్టడం వంటి అలవాట్లను నేర్చుకోవాలన్నారు. ఒత్తిడితో జీవితాన్ని గడపటం సాధారణమైన అంశం కాదని, రుణాలను చెల్లించకుండా జీవించటం సక్సెస్ కాదన్నారు. మంచి జీవితం కోసం చేసే పరుగులో అప్పుల ఊబిలో పడొద్దన్నారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)