చండీగఢ్ లో ఇందర్ జిత్ సింగ్ సిద్ధూ అనే పెద్దాయన రిక్షాతో రోడ్లపై చెత్త సేకరిస్తున్న వీడియోను మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన సోషల్ మీడియా ఖాతా 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. ఆయనొక రిటైర్డ్ పోలీస్ అధికారి. చాలా కాలంగా ఆయన నిత్యకృత్యం ఏంటంటే ప్రతీ రోజు ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఆ రిక్షా బండితో రోడ్లపై ఉన్న చెత్త సేకరించి, కాలనీని పరిశుభ్రంగా ఉంచడం. చండీగఢ్ సెక్టార్ 49 లోని వీధుల్లో ఆయన నిత్యం ఈ పని చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. స్వచ్ఛ సురేక్షణ్ జాబితాలో నగర పరిశుభ్రతకు గాను చండీగఢ్ కి తక్కువ ర్యాంకు రావడంతో ఆయన ఈ పనికి పూనుకున్నారు. ఎవరెవరి మీదో ఫిర్యాదులు చేయడమెందుకని నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో తన వంతు కృషి చేస్తున్నారు. పలువురు వేసే చెత్తను వయస్సుతో సంబంధం లేకుండా తొలగించడం అనేది వెలకట్టలేని పని.
ఆసక్తికర వీడియోను పోస్ట్ చేసిన ఆనంద్ మహీంద్రా
July 22, 2025
0
Tags