తమిళ నటుడు శ్రీనివాసన్‌ అరెస్ట్‌

Telugu Lo Computer
0


మిళ నటుడు 'పవర్‌స్టార్' శ్రీనివాసన్‌ను పోలీసులు (ఆర్థిక నేరాల విభాగం) చేశారు. రూ.1000 కోట్ల రుణం ఇప్పిస్తానని చెప్పి ఓ సంస్థ నుంచి ఆయన రూ.5 కోట్లు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. తిరిగి తమ రుణం రాకపోవడంతో, ఆ సంస్థ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నైలో శ్రీనివాసన్‌ను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇకపోతే, నటుడు శ్రీనివాసన్‌ తనకు తాను పవర్‌స్టార్‌ అని అనౌన్స్ చేసుకున్నారు. ఈ క్రమంలో అతని ఫ్యాన్స్ శ్రీనివాసన్‌ ను కోలీవుడ్‌లో ఇదే పేరుతో పిలుస్తుంటారు. పోలీసుల వివరాల ప్రకారం ఒక కంపెనీకి రూ.1000 కోట్ల రుణం మొత్తాన్ని 30 రోజుల్లో ఇప్పిస్తానని శ్రీనివాసన్ హామీ ఇచ్చారు. ఒకవేళ అప్పటికీ డబ్బులు అందకపోతే, తీసుకున్న రూ.5కోట్లు తిరిగి ఇస్తానని వారికి చెప్పారు. కానీ, ఆ డబ్బులను సినిమా నిర్మాణం మరియు వ్యక్తిగత అవసరాల కోసం వాడుకుని తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ సంస్థ యాజమాన్యం ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. శ్రీనివాసన్‌ సినిమాల్లో నటిస్తూనే చెన్నైలో ఓ ఫైనాన్స్‌ సంస్థను స్థాపించి, ఆ సంస్థ పేరుతోనే ఈ మోసానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే శ్రీనివాసన్‌ను కోర్టు రెండుసార్లు 'ప్రకటిత నేరస్థుడు'గా ప్రకటించింది. అయినప్పటికీ 2018 నుండి విచారణకు హాజరుకాకుండా దూరంగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. నటుడు శ్రీనివాసన్‌ 2010లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2011లో 'లథిక' అనే మూవీలో హీరోగా నటించి మెప్పించారు. ఆ తర్వాత వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఈ క్రమంలో 60కు పైగా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా చేస్తూనే, కమెడియన్‌గా పలు సినిమాల్లో కనిపించారు. మరికొన్నింటికి నిర్మాతగానూ వ్యవహరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)