చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ బీజింగ్‌లో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా జైశంకర్ వెల్లడించారు. 2020లో గల్వాన్ ఘటనతో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన తర్వాత భారత విదేశాంగశాఖ మంత్రి చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. టియాంజిన్ వేదికగా షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) కౌన్సిల్ సమావేశం జరగనుంది. బీజింగ్‌లో ద్వైపాక్షిక చర్చల అనంతరం మంత్రి అక్కడికి వెళ్లనున్నారు.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ
July 15, 2025
0
Tags