చైనా, హాంకాంగ్ లో బీభత్సం సృష్టించిన విఫా తుఫాన్ బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. విఫా తుఫాన్ తీరం దాటి బంగాళాఖాతంలోకి ప్రవేశించిన నేపథ్యంలో తుఫానుగా రూపాంతరం చెందినట్లు తెలుస్తోంది. అది క్రమేపి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో రాగాల మూడు రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి 60 కిలోమీటర్ల గరిష్ట వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, రైతులతో పాటు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
బంగాళాఖాతంలోకి ప్రవేశించిన విఫా తుఫాన్
July 23, 2025
0
Tags