అలాస్కా, తజికిస్తాన్ లో భూకంప ప్రకంపనలు సంభవించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. తజికిస్తాన్ లో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదు కాగా, అలస్కాలో 6.2గా నమోదైంది. ఒకే వారంలో అలాస్కాలో రెండు తీవ్ర భూకంపాలు సంభవించాయి. భూకంపం కారణంగా ప్రజలు మరోసారి భయాందోళనకు గురయ్యారు. అలాస్కాలో ఇప్పటి వరకు చాలా భయంకరమైన భూకంపాలు సంభవించాయి. ఇటీవల జూలై 17వ తేదీన అలాస్కాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ప్రజలు భయందోళన చెందారు. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు తరచూ భూమి కంపిస్తుండడంతో ఆయాదేశాధినేతలు ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా సునామీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని స్థానిక అధికారులు మత్సకారులను హెచ్చరిస్తున్నారు.
అలాస్కా, తజికిస్తాన్ లో భూకంపం
July 21, 2025
0
Tags