విన్‌ఫాస్ట్‌ కార్ల ప్రీ బుకింగ్‌ ప్రారంభం

Telugu Lo Computer
0


టెస్లా ముంబైలో తొలి కార్ల షోరూమ్‌ను నిన్న ప్రారంభించింది. అదేరోజున  వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్‌ సంస్థ తన వీఎఫ్‌6, వీఎఫ్‌7 మోడళ్ల ప్రీ బుకింగ్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఆగస్టులో వీటిని లాంచ్‌ చేయబోతోంది. దేశంలోకి ఎంట్రీ ఇచ్చిన రోజే మరో విదేశీ కంపెనీ నుంచి టెస్లా ఎదుర్కోవడం గమనార్హం. వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్‌ ఆగస్టులో వీఎఫ్‌6, వీఎఫ్‌7 మోడళ్లను లాంచ్‌ చేయనుంది. రూ.21 వేలు చెల్లించి కంపెనీ వెబ్‌సైట్‌లో ప్రీ బుకింగ్‌ చేసుకోవచ్చు. ఈ మొత్తం రిఫండబుల్‌. టెస్లా తన కార్లను దిగుమతి చేసుకుంటుండగా.. విన్‌ఫాస్ట్‌ మాత్రం తమిళనాడులో 2 బిలియన్‌ డాలర్లు వెచ్చించి తయారీ ప్లాంట్‌ను నెలకొల్పుతోంది. అంతేకాదు దేశవ్యాప్తంగా చిన్నా, పెద్ద నగరాల్లో షోరూమ్‌లు తెరుస్తోంది. విన్‌ఫాస్ట్‌ వీఎఫ్‌ 6 ధర రూ.18 నుంచి రూ.24 లక్షల మధ్య ఉంటుందని అంచనా. ఇది 59.6 kWh బ్యాటరీ ఆప్షన్‌తో వస్తోంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 440 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. లెవల్‌ 2 అడాస్‌ ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి. ఇక వీఎఫ్‌7 అనేది మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీ. దీని ధర రూ.30-35 లక్షలు ఉండొచ్చు. ఇందులో 75.3kWh బ్యాటరీ ఉంటుంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 450 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది కూడా లెవల్‌ 2 అడాస్‌ ఫీచర్లతో అతిపెద్ద టచ్‌స్క్రీన్‌, కనెక్టెడ్‌ కార్‌ టెక్నాలజీస్‌ వంటి ఫీచర్లతో రాబోతోంది. ఇవికాకుండా టాటా మోటార్స్‌, మహీంద్రా వంటి దేశీయ కంపెనీలతో పాటు బీఎండబ్ల్యూ, బీవైడీ, వంటి కార్ల నుంచి టెస్లాకు గట్టి పోటీ ఉండబోతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)