గత ఏడాది ప్రైవేట్ టెలీకం కంపెనీలు ఛార్జీలు పెంచడంతో చాలామంది బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపారు. తిరిగి వారిని ఆకట్టుకునేందుకు జియా వివిధ రకాల ప్లాన్స్ తీసుకువస్తోంది. దీర్ఘకాలిక వ్యాలిడిటీ, ఇతర ప్రయోజనాలతో రిలయన్స్ జియో విభిన్నమైన ప్లాన్స్ అందిస్తోంది. ఇటీవల ట్రాయ్ ఆదేశాల మేరకు డేటాతో సంబంధం లేకుండా కేవలం వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ ప్లాన్స్ ప్రవేశపెట్టింది. రెండు కొత్త ప్లాన్స్ తీసుకొచ్చింది. ఇవి ఏకంగా ఏడాది కాల వ్యవధికి పనిచేస్తాయి. లాంగ్ వ్యాలిడిటీ కావడంతో తరచూ రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. డేటా ఉండదు. కేవలం వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ మాత్రమే ఉంటాయి. 84 రోజుల వ్యాలిడిటీ, 365 రోజుల వ్యాలిడిటీతో రెండు ప్లాన్స్ అందుబాటులో ఉంచింది. రిలయన్స్ జియో 365 రోజుల వ్యాలిడిటీతో 1958 రూపాయల ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్‌లో ఏ నెట్‌వర్క్‌కు అయినా అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా రోజుకు 100 ఎస్ఎంఎస్ల చొప్పున ఏడాదిలో 3600 ఉచిత మెస్సేజీలు పంపించుకోవచ్చు. నేషనల్ రోమింగ్ ఫ్రీ ఉంటుది. దీంతో పాటు జియో సినిమా, జియో టీవీ ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. మరొకటి 458 రూపాయల ప్లాన్. ఇది 84 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఈ ప్లాన్‌లో కూడా అన్లిమిటెడ్ కాలింగ్, 1000 ఉచిత ఎస్ఎంఎస్ల సౌకర్యం ఉంటుంది. డేటా ఉండదు. డేటా కావాలంటే డేటా ప్యాక్స్ వివిధ ప్లాన్స్‌తో అందుబాటులో ఉన్నాయి. జియో సినిమా, జియో టీవీ ఫ్రీ ఉంటాయి. ఇంతకు ముందు ఈ రెండు ప్లాన్ స్థానంలో 84 రోజుల వ్యాలిడిటీతో 479 రూపాయల ప్లాన్, 1899 రూపాయలతో 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్ ఉండేవి. అయితే జియో ఈ రెండు ప్లాన్స్ తొలగించింది.
ట్రాయ్ ఆదేశాల మేరకు డేటాతో సంబంధం లేకుండా కొత్త వాయిస్ కాలింగ్ ప్లాన్స్ తీసుకొచ్చిన జియో !
July 10, 2025
0
Tags