చెన్నైలో తమిళగ వెట్రి కళగం పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగింది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా టీవీకే వ్యవస్థాపకుడు, సినీనటుడు విజయ్‌ను పార్టీ ప్రకటించింది. వచ్చే నెలలో భారీ ఎత్తున రాష్ట్ర మహాసభలు నిర్వహించాలని పార్టీ ప్రతిపాదించింది. తమ పార్టీ సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకు గ్రామాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. తమిళనాడు ఎన్నికల్లో వేర్పాటు వాదులతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. భాజపా విభజన రాజకీయాలు చేస్తోందని మండిపడిన ఆయన.. భాజపా విద్వేష రాజకీయాలు తమిళనాడులో చెల్లవన్నారు. ఈ కీలక సమావేశంలో పలు తీర్మానాలను పార్టీ ఆమోదించింది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంగ్ల భాషపై చేసిన వ్యాఖ్యలు దురుద్దేశపూరితమైనవని పేర్కొంది. ఆయన వ్యాఖ్యలు తమిళనాడు ద్విభాషా విధానంపై ప్రత్యక్ష దాడి అని అభివర్ణించింది. తమిళనాడుపై హిందీ, సంస్కృత భాషల్ని రుద్దడాన్ని తమ పార్టీ ఎప్పటికీ అంగీకరించదని స్పష్టం చేసింది.
తమిళగ వెట్రి కళగం పార్టీ సీఎం అభ్యర్థిగా విజయ్
July 04, 2025
0
Tags