వైసీపీ నేత నల్లపరెడ్డి టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి లోక్‌సభ దృష్టికి తీసుకెళ్లారు. మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం లైంగిక దాడితో సమానమని అన్నారు. ప్రజాసేవలో ఉన్న మహిళ పట్ల ఇలాంటి వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా రాజకీయాల్లో ఉన్న మహిళల గౌరవానికి భంగం కలగకుండా ప్రత్యేక చట్టం తీసుకురావాలని శబరి స్పీకర్‌ను కోరారు.
మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు లైంగిక దాడితో సమానం !
July 30, 2025
0
Tags