తిరుమలలో రెండు రోజులపాటు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

Telugu Lo Computer
0


జులై 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం సందర్భంగా 15,16 రెండు రోజులపాటు బ్రేక్‌దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ  అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా జూలై 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కారణంగా రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామన్నారు. జూలై 14, 15వ తేదిల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులు సహకరించాలని కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)