కేరళకు యూకే ఏవియేషన్ ఇంజినీర్ల రాక !

Telugu Lo Computer
0


కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో బ్రిటన్‌ రాయల్‌ నేవీకి చెందిన యుద్ధ విమానం ఎఫ్‌-35బి సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన విషయం తెలిసిందే. దానిని మరమ్మతు చేసేందుకు, విమానాన్ని ఎయిర్‌లిఫ్ట్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధిత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఫైటర్‌ జెట్‌ మరమ్మతు పనులను చేసేందుకు యూకే నుంచి 24 మంది ఏవియేషన్ ఇంజినీర్ల బృందం ప్రత్యేక పరికరాలతో రాయల్ ఎయిర్ ఫోర్స్ A400M విమానంలో ఆదివారం కేరళకు చేరుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో మరమ్మతులు చేయడానికి దానిని హ్యాంగర్‌కు తరలించారు. రానున్న రోజుల్లో దీన్ని సీ-17 గ్లోబ్‌మాస్టర్‌ రవాణా విమానంలో తరలించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. అవసరమైన అన్ని మరమ్మతులు, భద్రతా తనిఖీల తర్వాత విమానం తిరిగి సేవలను ప్రారంభిస్తుందని బ్రిటిష్ హైకమిషన్ అధికారి తెలిపారు. తద్వారా ఇతర విమానాల షెడ్యూల్‌ నిర్వహణకు ఎటువంటి అంతరాయం ఉండదని పేర్కొన్నారు. కేరళ విమానాశ్రయంలో ఉన్న ఫైటర్‌ జెట్‌ ఎఫ్‌-35బి విమానానికి భారీ భద్రత కల్పించామని, సాయుధ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది కాపలాగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)