వినియోగదారుల కొంప ముంచిన 'టీ' యాప్‌

Telugu Lo Computer
0


'టీ' అనే మహిళల డేటింగ్ యాప్.. వినియోగదారుల కొంపముంచింది. ఈ యాప్ నుంచి లక్షల మంది యూజర్ల వ్యక్తిగత సమాచారం, చాట్‌లు, ఫోటోలు లీక్‌ కావడంతో వివాదంలో చిక్కుకుంది. ప్రస్తుతం 'టీ' యాప్‌కు దాదాపు 16 లక్షల వినియోగదారులు ఉన్నారు. మహిళలకే ప్రత్యేకంగా ఉండటం, ఫోటో వెరిఫికేషన్ ఫీచర్లతో ఆకర్షణ పొందినవారు ఇప్పుడు తమ డేటా ఎక్కడ, ఎవరితో ఉందో అని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు యూజర్లు తమ ఖాతాలను డిలీట్ చేసినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఓ అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ మీడియా సంస్థ కథనం ప్రకారం, 11 లక్షల మందికిపైగా వినియోగదారుల ప్రైవేట్ డేటా లీక్ అయింది. ఇందులో 2023 నుంచి ఇప్పటి వరకూ చాట్ మెసేజులు, గర్భస్రావం వంటి అత్యంత వ్యక్తిగతమైన విషయాలు, సంబంధాల గురించి చేసిన చర్చలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితమే వేలాది మంది వినియోగదారుల సెల్ఫీలు, గవర్నమెంట్ ఐడీ కార్డుల ఫోటోలు కూడా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఫేస్ వెరిఫికేషన్ కోసం అప్‌లోడ్ చేసిన ఫోటోలు సైతం లీక్ కావడంతో, వినియోగదారుల భద్రతపై తీవ్రమైన అనుమానాలు నెలకొన్నాయి. ఈ ఘటనపై స్పందించిన సైబర్ సెక్యూరిటీ నిపుణులు సైతం స్పందించారు. "ఇది సాధారణ లీక్ కాదని.. సెన్సిటివ్ డేటా, వ్యక్తిగత సమాచారం బహిర్గతం కావడం వల్ల వినియోగదారులకు మానసిక, సామాజిక రిస్క్ ఉందని హెచ్చరించారు. . చాలామంది నకిలీ పేర్లతో అకౌంట్లు క్రియేట్ చేసినా, కొందరు నిజమైన వివరాలను వాడారని అంటున్నారు. డార్క్ వెబ్‌తో పాటు, సాధారణ వెబ్‌లోనూ కొన్ని చాట్ లాగ్‌లు, ఫోటోలు, పేర్లు డౌన్‌లోడ్ చేయగలిగేలా లీక్ అయ్యాయని సమాచారం. కొన్ని టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా ఈ డేటా పంచుకున్నట్టు నివేదికలు వెలుగుచూశాయి. ఈ వ్యవహారంపై 'టీ' ప్రతినిధులు స్పందిస్తూ .. మేము ఈ ఘటనపై లోతుగా విచారణ ప్రారంభించాం. డేటా లీక్ నివారించేందుకు అవసరమైన సాంకేతిక చర్యలు తీసుకుంటున్నాం. మేం సైబర్ నిపుణులతో కలిసి పనిచేస్తున్నాం. భద్రతా సంస్థలకు పూర్తి సహకారం అందిస్తున్నాం" అని తెలిపారు

Post a Comment

0Comments

Post a Comment (0)