ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 25 నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 25 నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కాగా ఆగస్టు 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈ పంపిణీ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. క్యూ ఆర్ కోడ్‌తో అందించే కొత్త రేషన్ కార్డులపై నేతల ఫొటోలు ఉండవని మంత్రి నాదెండ్ల క్లారిటీ ఇచ్చారు. అటు ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల రేషన్ దుకాణాల్లో సరుకులు సరఫరా చేస్తామని మంత్రి నాదెండ్ల తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)