నాకు మరాఠీ రాదు, దమ్ముంటే నన్ను మహారాష్ట్ర నుంచి తరిమేయండి : భోజ్‌పురి నటుడి సవాల్‌

Telugu Lo Computer
0


ముంబైలో మరాఠీలో మాట్లాడనందుకు ఓ స్వీట్‌ షాప్‌ యజమానిని కొట్టిన ఘటన కలకలం రేపింది. తాను కూడా మరాఠీ మాట్లాడనని, దమ్ముంటే తనను మహారాష్ట్ర నుంచి తరిమేయండని హమర్‌ నామ్‌ బా కన్హయ్యలో నటించిన భోజ్‌పురి నటుడు, బీజేపీ ఎంపీ దినేశ్‌ లాల్‌ యాదవ్‌ సవాల్‌ విసిరారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో దినేశ్‌ యాదవ్‌ మాట్లాడుతూ మరాఠీ మాట్లాడలేదని దాడి చేస్తారా? ఇవన్నీ చెత్త రాజకీయాలు. దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకూడదు. ఇలాంటి నీచ రాజకీయాలు చేసేవారు అలాంటివాటికి దూరంగా ఉంటే బాగుంటుంది. మీకంత దమ్ముంటే నన్ను మహారాష్ట్ర నుంచి వెళ్లగొట్టండి చూద్దాం. నేను మరాఠీ మాట్లాడను. రాజకీయ నాయకులందరికీ నేను సవాల్‌ విసురుతున్నా నేను ఇక్కడే ఉంటాను. దమ్ముంటే నన్ను మహారాష్ట్ర నుంచి తరిమేయండి. నేను కూడా రాజకీయ నాయకుడినే పాలిటిక్స్‌ అనేవి ప్రజల సంక్షేమానికి ఉపయోగపడాలే తప్ప వారిని నిలువుదోపిడీ చేయడానికి కాదు. ఎవరికైనా ఐదు భాషలు నేర్చుకోవాలనిపిస్తే నేర్చుకుంటారు. మరాఠీ అందమైన భాష. భోజ్‌పురి, తెలుగు, తమిళం, గుజరాతీ ఈ భాషలన్నీ అందరూ నేర్చుకోవచ్చు. ఎవరూ నేర్చుకోకపోయినా ఏం పర్వాలేదు. అలా అని ఎందుకు ఫలానా భాష నేర్చుకోలేదని టార్గెట్‌ చేయడం కరెక్ట్‌ కాదు అని చెప్పుకొచ్చారు. దినేశ్‌ లాల్‌ యాదవ్‌ను నిరాహువా అని కూడా పిలుస్తుంటారు. భోజ్‌పురిలో అనేక సినిమాలు చేసిన ఈయన హిందీ బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లోనూ పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)