ఇంటర్ విద్యార్థి ప్రతిభను గుర్తించి ప్రోత్సాహకంగా లక్ష రూపాయల చెక్కును అందజేసిన పవన్ కళ్యాణ్

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా జాడవారి కొత్తవలసకు చెందిన రాజాపు సిద్ధూ, ప్రయాణ ఖర్చులు తగ్గించుకునేందుకు తానే స్వయంగా బ్యాటరీతో నడిచే సైకిల్ రూపొందించాడు. ఈ సైకిల్ కేవలం మూడు గంటల ఛార్జ్‌తో 80 కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేయగలదని తెలిపాడు. సిద్ధూ ప్రతిభకు సంబంధించిన వివరాలు సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, సిద్ధూను మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించారు. అక్కడ సిద్ధూ రూపొందించిన సైకిల్‌పై కూర్చుని స్వయంగా తొక్కి అతడికి మరింత ఉత్సాహాన్నిచ్చారు. అంతేకాకుండా, సిద్ధూకు భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణల దిశగా దూసుకెళ్లేందుకు ప్రోత్సాహంగా లక్ష రూపాయల చెక్కును అందజేశారు. అలాగే సిద్ధూ రూపొందించిన 'గ్రాసరీ గురూ' అనే వాట్సాప్ సేవా బ్రోచర్‌ను కూడా పవన్ పరిశీలించి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)