ఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా ఉత్సవాలు

Telugu Lo Computer
0


విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయంలో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నారు.. ఈ సమయంలో ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సెప్టెంబర్‌ 22న దసరా ఉత్సవాలు ప్రారంభంకానుండగా అక్టోబర్‌ 2వ తేదీన విజయదశమి రోజున ఉదయం 9.30 గంటలకు మహా పూర్ణాహుతితో ఉత్సవాలు ముగియనున్నాయి.. అదేరోజు సాయంత్రం 5 గంటలకు పవిత్ర కృష్ణానది యందు హంస వాహన తెప్పోత్సవం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 29న మూలానక్షేత్రం రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)