పశ్చిమాసియాలో పరిస్థితులు క్రమంగా సద్దుమణుగుతున్నాయి. టెల్‌అవీవ్ దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ వైమానిక సేవలను నిలిపివేసిన ఇరాన్ తాజాగా వాటిని పునరుద్ధరించింది. 20 రోజుల నిషేధం తర్వాత టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేని అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలిసారిగా విదేశీ విమానం ల్యాండ్ అయ్యింది. ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది. అంతకుముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి ఫ్లైయింగ్ దుబాయ్ సంస్థకు చెందిన విమానం భారీ భద్రత నడుమ ల్యాండ్ అయినట్లు ఇరాన్ పౌర విమానయాన శాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్‌తో ఇటీవల ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో తాజా పరిణామం ఇరాన్ వైమానిక రంగం స్థిరత్వం సాధించే దిశగా అడుగులు వేసేందుకు దోహదపడుతుందని పౌర విమానయాన శాఖ అధికార ప్రతినిధి మెహ్‌దీ రమేజానీ మీడియాకు వెల్లడించారు. అంతర్జాతీయ విమానాలు ఇరాన్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా అవసరమైన చర్యలు చేపడతామని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని క్రమంగా సర్వీసుల సంఖ్యను పెంచుతామని ఆయన తెలిపారు.
20 రోజుల నిషేధం తర్వాత టెహ్రాన్‌లోని విమానాశ్రయంలో విదేశీ విమానం ల్యాండ్
July 04, 2025
0
Tags