అక్టోబరు 15 వరకు ప్రత్యేక రైళ్ల పొడిగింపు

Telugu Lo Computer
0


క్టోబరు 15 వరకు 54 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్రధాన మార్గాల్లో కొనసాగుతున్న రద్దీకి అనుగుణంగా పొడిగింపు చేపట్టినట్టు పేర్కొన్నారు. ఈ రైళ్లు తిరుపతి, మదురై, నాగర్‌ సోల్‌కు వెళ్లే వారికి అనుకూలంగా ఉంటాయని వెల్లడించారు. కాచిగూడ-మదురై మార్గంలో 07191/07192 నంబర్లు కలిగిన ప్రత్యేక రైళ్లు, హైదరాబాద్‌-కొల్లాం మార్గంలో 07193/07194, హైదరాబాద్‌-కన్యాకుమారి మార్గంలో 07230/07239 రెళ్లను పొడిగించారు. అదే విధంగా సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య 10, కాచిగూడ-నాగర్‌సోల్‌ మధ్య 8, నాందేడ్‌-తిరుపతి మధ్య 10, నాందేడ్‌-ధర్మవరం మధ్య 10 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల మీదుగా ఆరు ప్రధాన మార్గాల్లో నడుస్తున్న 54 ప్రత్యేక రైళ్లను అక్టోబర్‌ 15వ తేదీ వరకు పొడిగించారు.మదురై-కాచిగూడ స్పెషల్‌ ట్రైన్‌ ఆగస్టు 20వ తేదీ నుంచి అక్టోబర్‌ 15 వరకు ప్రతి బుధవారమూ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. 07193/07194 నంబర్‌ కలిగిన రెండు స్పెషల్‌ రైళ్లు హైదరాబాద్‌- కొల్లం మధ్య రాకపోకలు సాగిస్తున్నాయి. హైదరాబాద్‌ నుంచి కొల్లం వెళ్లే ఈ స్పెషల్‌ రైళ్లు ఆగస్టు 16 నుంచి అక్టోబర్‌ 11వ తేదీ వరకు ప్రతి శనివారమూ ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. 07230/07229 నంబర్‌ గల రెండు రైళ్లు హైదరాబాద్‌-కన్యాకుమారి మధ్య రాకపోకలు సాగిస్తాయి. 07229 నంబర్‌ కలిగిన హైదరాబాద్‌-కన్యాకుమారి స్పెషల్‌ రైలు ఆగస్టు 13 నుంచి అక్టోబర్‌ 8వ తేదీ వరకు ప్రతి బుధవారమూ నడుస్తుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)